Nizamabad Development Works | డివిజన్లలో పనులు నాణ్యతతో చేపట్టాలి : ఎమ్మెల్యే ధన్​పాల్​

నిజామాబాద్​ నగరంలో ఆయా డివిజన్లలో జరుగుతున్న పనులను నాణ్యతతో చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Development Works | నగరంలో ఆయా డివిజన్లలో జరుగుతున్న పనులను నాణ్యతతో చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని 23, 24, 6, 48వ డివిజన్లలో రోడ్డు పనులకు భూమిపూజ చేశారు.

Nizamabad Development Works | ప్రతి డివిజన్​కు రూ.20 లక్షలు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA Dhanpal) మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ప్రతి డివిజన్​కు రూ.20 లక్షలు కేటాయించారన్నారు. ఈ నిధులతో ప్రతి డివిజన్​లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే ఖిల్లా రామాలయ అభివృద్ధిలో భాగంగా రోప్​వేకు సంబంధించిన డీపీఆర్ కూడా సిద్ధమవుతుందని చెప్పారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ నియోజకవర్గానికి నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. గత మూడేళ్లుగా సీడీపీ నిధుల కోసం అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, కార్పొరేటర్లు, స్రవంతిరెడ్డి, సుమిత్ర కిషోర్, విజయ మల్లేష్ యాదవ్, ప్రసన్న శ్యామల సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Fire Service Awards | ఉత్తమ అగ్నిమాపక సిబ్బందికి పురస్కారాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *