Nizamabad Fire Service Awards | ఉత్తమ అగ్నిమాపక సిబ్బందికి పురస్కారాలు

రాష్ట్ర ప్రభుత్వం అగ్నిమాపక శాఖలో ఉత్తమ సేవలందించిన వారిని గుర్తిస్తూ ఉత్తమ సేవా పతకాలు ప్రకటించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Fire Service Awards | రాష్ట్ర ప్రభుత్వం అగ్నిమాపక శాఖలో ఉత్తమ సేవలందించిన వారిని గుర్తిస్తూ ఉత్తమ సేవా పతకాలు ప్రకటించింది. జిల్లా (Nizamabad) నుంచి 9మంది అధికారులు, సిబ్బంది ఈ సేవా పతకాలకు ఎంపికయ్యారు.

Nizamabad Fire Service Awards | వీరికే పతకాలు

తొమ్మిది మంది అధికారుల్లో ఏడుగురు అధికారులు ఇప్పటికే రిటైర్​ అయ్యారు. ఇద్దరు ఉద్యోగులు ప్రస్తుతం లీడింగ్​ ఫైర్​ ఫైటర్లుగా విధుల్లో ఉన్నారు. లీడింగ్​ ఫైర్​ ఫైటర్లు అనంతరావు, ఎం. ప్రకాశ్ సేవా పతకాలు సాధించారు. రిటైర్డ్​ ఉద్యోగులు ఎల్​ గంగాధర్​ (బోధన్​), చంద్రగౌడ్​, విఠల్​, గంగారాం, మహ్మద్​ ఉస్మాన్​, సంజీవయ్య, గంగాదాస్​ పతకాలు​ పొందిన వారిలో ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Durga Puja Kumkumarchana | దుర్గామాత మండపాల వద్ద కుంకుమార్చనలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *