Bodhan Development Works | నిర్ణీత గడువులోపు అభివృద్ధి పనులను పూర్తిచేయాలి..

నిజామాబాద్​ జిల్లాలో నిర్ణీత గడువులోపు అభివృద్ధి పనులను పూర్తిచేయాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్: Bodhan Development Works | జిల్లాలో నిర్ణీత గడువులోపు అభివృద్ధి పనులను పూర్తిచేయాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్(bodhan)​ ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్​ ఇలా త్రిపాఠితో కలిసి బోధన్​ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

Bodhan Development Works | తాగునీటి సరఫరాను మెరుగుపర్చేందుకు..

తాగునీటి సరఫరాను మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన పనుల ప్రగతిని, అమృత్ పథకం, టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపడుతున్న పనుల వివరాలను సుదర్శన్​రెడ్డి అడిగి తెలుసుకున్నారు. గడువులోపు నాణ్యతతో పూర్తి చేసేలా నిశిత పర్యవేక్షణ జరపాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరా పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పైప్​లైన్ల మరమ్మతులు, లీకేజీలను అరికట్టడం, ట్యాంకుల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలన్నారు.

Bodhan Development Works | గంటపాటు నీటి సరఫరా..

బోధన్ మున్సిపల్ పట్టణం పరిధిలో కుళాయిల ద్వారా రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నందున నీటి సరఫరా సమయాన్ని గంటపాటు కొనసాగించాలని ప్రభుత్వ సలహాదారు సూచించారు. రానున్న రోజుల్లో నీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అవసరమైతే వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకుని నీటి సరఫరా చేసేందుకు వీలుగా ప్రైవేటు బోర్లను గుర్తించాలన్నారు. బోధన్ మున్సిపల్ కార్యాలయ నూతన భవన సముదాయం నిర్మాణానికి టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

Bodhan Development Works | డంపింగ్​ యార్డు..

డంపింగ్ యార్డు నిర్వహణ, బయో మైనింగ్ సక్రమంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఇతర ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను మైల్​స్టోన్ ప్రకారం జరిగేలా పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని, ప్రతి స్కూల్లో తప్పనిసరిగా తాగునీటి వసతి అందుబాటులో ఉండాలన్నారు. సమీక్ష సమావేశంలో బోధన్ మున్సిపల్ ఛైర్మన్ పద్మా శరత్ రెడ్డి, అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్డీవో విజయ కుమారి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఆర్అండ్​బీ ఎస్ఈ అజ్మీరా రాము, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

44 1

ఇది కూడా చదవండి: Idupu Kayitham 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *