అక్షరటుడే, ఎల్లారెడ్డి: BRS Protest Against Congress | రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ (Yellareddy BRS) పార్టీ వారం రోజుల పోరుబాటకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ కార్యకర్తలతో కాంగ్రెస్ ప్రభుత్వ దగా, అవినీతి, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భారీ ధర్నా నిర్వహించారు. ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు జాజాల సురేందర్ (Jajala Surender) ఆధ్వర్యంలో జరిగిన ఈ పోరాటంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తారు.
మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టేందుకు జిల్లావ్యాప్తంగా బుధవారం నుండి వారం రోజుల పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, బైక్ ర్యాలీలు, 420 హామీల ఫ్లెక్సీ ప్రదర్శన చేపట్టామన్నారు.
BRS Protest Against Congress | కాంగ్రెస్ పాలనపై నిరసన కార్యక్రమాలు
ఈనెల 3న వ్యవసాయ విధ్వంసం, నీటి పారుదల రంగం, యూరియా, రైతు బీమా అంశాలపై రైతు సదస్సులు, ఆర్డీవో, అర్బన్ ఏరియాలో 22వి నిషేధిత భూముల కోసం దరఖాస్తుల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నారు. అలాగే 4న హామీల అమలులో విఫలమైన పథకాలను నిరసన కార్యక్రమం చేపడ్తారు. విద్యార్థులు, వికలాంగులు, మహిళలతో సదస్సులు, కలెక్టరేట్లో ఎస్సీలకు హామీ ఇచ్చిన మహిళలకు రూ. 2500, కల్యాణలక్ష్మి పెంపు, విద్యార్థినులకు స్కూటీల కోసం వంటా-వార్పు చేపట్టనున్నారు. 5న ఫీజు రీయింబర్స్ మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ కోసం నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తారు. 6న పల్లెల్లో విద్యార్థుల సమస్యలపై నిరసనలు ఉంటాయి. 7న 420 హామీల అమలు చేయాలంటూ జిల్లా, మండల కేంద్రాల్లో ప్రజావాణిలో వినతిపత్రాలు సమర్పించనున్నారు. 8న జిల్లా కేంద్రంలో ప్రెస్మీట్ నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను వివరించనున్నారు. అనంతరం విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పిస్తారు. 10న ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాలకు సంఘీభావం తెలుపనున్నారు.
ఇది కూడా చదవండి: TGSRTCలో కండక్టర్ పోస్టులు..!