అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Power Cuts | ప్రభుత్వానికి కాళేశ్వరంపై విమర్శలు చేయడంపై ఉన్న శ్రద్ధ రైతులకు కరెంట్ సరఫరా చేయడంలో లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి విమర్శించారు. శనివారం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కామారెడ్డి (Kamareddy) విద్యుత్ కార్యాలయం ఎదుట విద్యుత్ కోతలపై ధర్నా చేపట్టారు.
Kamareddy Power Cuts | ప్రభుత్వానికి ముందుచూపు లేకనే..
ఈ సందర్భంగా కేవీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ముందు చూపు లేకనే విద్యుత్ కోతలని విమర్శించారు. ఎల్నినో వల్ల సమస్య ఉంటుందని ఆర్నెళ్ల క్రితమే తెలిసినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. గత ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారంపై పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పంటకు నీళ్లు ఇవ్వాలని, యాసంగి పంటకి ప్రణాళిక తయారు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు.
ఇది కూడా చదవండి..: Yendamuri Varaprasad Death | సీనియర్ పాత్రికేయుడు యండమూరి వరప్రసాద్ కన్నుమూత