Vennamuddala Bathukamma | ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ..ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ..?

తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Vennamuddala Bathukamma | తెలంగాణ  ( Telangana )సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బతుకమ్మ పండుగలో ఎనిమిదో రోజును తెలంగాణ ఆడపడుచులు ‘వెన్నముద్దల బతుకమ్మ’ పేరుతో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో, ప్రతిరోజూ ఒక్కో వరుసను పెంచుకుంటూ పూలతో అలంకరిస్తారు.

Vennamuddala Bathukamma | పూల అలంకరణ ..

ఎనిమిదో రోజైన ఈ ప్రత్యేక రోజున గులాబీ, చేమంతి, తంగేడు, గునుగు , రకరకాల గడ్డి పూలతో బతుకమ్మను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతారు. ఇవాళ ఎనిమిది వరుసలతో బతుకమ్మను త్రికోణంలో లేదా వలయాకారంలో అందంగా పేరుస్తారు.

Vennamuddala Bathukamma | ప్రత్యేక నైవేద్యాలు..

ఇవాళ  అమ్మవారికి సమర్పించే నైవేద్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వెన్నతో చేసిన పదార్థాలు, నువ్వులు, బెల్లం, వెన్న లేదా నెయ్యి కలిపిన నైవేద్యాలను గౌరమ్మకు సమర్పిస్తారు. అందుకే ఈ రోజును ‘వెన్నముద్దల బతుకమ్మ’ అని పిలుస్తారని పెద్దలు చెబుతారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, యువతులు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ గౌరమ్మ పాటలు పాడుతూ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Kamareddy Dasara Celebrations | దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు : షబ్బీర్ అలీ

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *