Martyrs Remembrance Day | డిచ్​పల్లి బెటాలియన్‌లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం

డిచ్​పల్లి ఏడో బెటాలియన్​లో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్‌పల్లి : Martyrs Remembrance Day | డిచ్​పల్లి (Dichpally) ఏడో బెటాలియన్​లో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు.

Martyrs Remembrance Day | వారి సేవలను మరువలేం..

దేశ ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కమాండెంట్ సీతారాం పేర్కొన్నారు. వారి ధైర్యసాహసాలు, అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, అమరవీరుల త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ, వారు చూపిన మార్గంలో విధి నిర్వహణకు అంకితభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నరసింహస్వామి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: NHM Employees Strike | మా గోస పట్టించుకోరా..? ఎన్​హెచ్​ఎం ఉద్యోగుల ఆందోళన..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *