అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: NEET PG Exam Centres | నీట్ పీజీ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ భవేష్ మిశ్రా శనివారం క్షేత్రస్థాయిలో సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాలో పరీక్షకు 265 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.
NEET PG Exam Centres | పరీక్ష కేంద్రాల తనిఖీ..
అర్సపల్లిలోని ఏవీ ఎంటర్ ప్రైజెస్, మల్లారంలోని షిఫ్ట్ టెక్నాలజీస్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్ (Collector Bhavesh Mishra) సందర్శించి పరిశీలించారు. సరిపడా కంప్యూటర్లు, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ ధృవీకరణ పరికరాలు, ఇంటర్నెట్ కనెక్షన్ ఇత్యాది సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని గమనించారు. విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా చూడాలని, పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, వైద్య సదుపాయాలు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.
నీట్(పీజీ) పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు, లోటుపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎగ్జామ్ సెంటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు నీట్ (పీజీ) పరీక్ష కొనసాగుతుందన్నారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఈవో అశోక్, డీఐఈవో రవికుమార్, డీఎంహెచ్‌వో రాజశ్రీ, ఏసీపీ ప్రకాశ్, తహశీల్దార్లు వినయ్ కుమార్, హరికిషోర్, కలెక్టరేట్ ఏవో బాలరాజు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy BRS Councillors | కామారెడ్డి బల్దియాలో ఉద్రిక్తత.. రాజీనామా చేస్తామన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు