నిజామాబాద్Bakrid Security Measures | బక్రీద్‌కు పటిష్ట భద్రత: ఎస్పీ రాజేష్ చంద్ర

Bakrid Security Measures | బక్రీద్‌కు పటిష్ట భద్రత: ఎస్పీ రాజేష్ చంద్ర

బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకునేందుకు కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 24 గంటలు పనిచేసే పోలీస్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

అక్షరటుడే, కామారెడ్డి: Bakrid Security Measures | రానున్న బక్రీద్ (Bakrid) పండుగను ప్రశాంతంగా జరుపుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 24 గంటలు పనిచేసే ప్రత్యేక జిల్లా పోలీస్ కంట్రోల్ రూంను (Kamareddy Police) ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Bakrid Security Measures | శాంతిభద్రతలను కాపాడేందుకు..

జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో ఆరు ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటల పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని ఎస్పీ వివరించారు. అనుమానాస్పద ఘటనలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్ 87126 86133 లేదా డయల్ 100కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. వాహనాలను ఆపడం, తనిఖీలు చేయడం వంటి అధికారం కేవలం ప్రభుత్వ విభాగాలకే ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. వ్యక్తులు లేదా సంస్థలు స్వయంగా తనిఖీలకు దిగితే చట్టపరంగా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో విద్వేషపూరిత, రెచ్చగొట్టే పోస్టులు, మత సామరస్యాన్ని దెబ్బతీసే వీడియోలు ప్రచారం చేసే వారిపై పోలీసు నిఘా ఉంటుందన్నారు. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులతో సహకరించాలని కోరారు.

ఇది కూడా చదవండి: RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Pamula Vagu Bridge | వంతెన నిర్మించలేనందుకు బాధ్యతగా ఎమ్మెల్యే రాజీనామా చేయాలి..

అక్షరటుడే, లింగంపేట: Pamula Vagu Bridge | మండలంలో (lingampet) వంతెన...

Bandi Bhagirath POCSO Case | భగీరథ్ పోక్సో కేసులో ట్విస్ట్​.. బాధితురాలి వయసుపై కోర్టులో సంచలన వాదనలు!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Bandi Bhagirath POCSO Case|కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

Stock Market Rally | వాల్యూ బయ్యింగ్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Rally | అమెరికా, చైనాల...

Voter List Revision| మూడో దశ ఎస్‌ఐఆర్‌ షురూ.. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో ఓటర్ల వివరాల ధృవీకరణ

అక్షరటుడే వెబ్‌డెస్క్:Voter List Revision|భారత ఎన్నికల సంఘం (ECI) ఓటర్ల జాబితాలను...