అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy BRS Councillors | వార్డులో సమస్యలపై పట్టు ఉన్న తమను వదిలి నేరుగా వార్డుల్లో అధికారులు తిరగడంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కామారెడ్డి (Kamareddy) కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
Kamareddy BRS Councillors | పోడియం ఎదుట ఆందోళన..
సమావేశం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ కౌన్సిలర్లు పోడియం ముందుకు వెళ్లి నిరసన తెలిపారు. తమ వార్డులో అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన కనీస సమాచారం ఇవ్వడం లేదన్నారు. తన వార్డులో నెల క్రితమే జేసీబీతో పని చేయిస్తుంటే మధ్యలోనే తీసుకెళ్లారని, ప్రస్తుతం అదే పని తనకు చెప్పకుండా వచ్చి జేసీబీతో చేయించడం ఎంతవరకు సమంజసమని కౌన్సిలర్ అరికల ప్రభాకర్ యాదవ్ ప్రశ్నించారు. ఏదైనా అడిగితే షబ్బీర్ అలీ చెప్పారు, నయీమ్ చెప్పారని పనులు చేస్తే తాము ఉండి ఎందుకుని ఆయన ప్రశ్నించారు. ఇక తాము వార్డులకు అవసరం లేదని.. రాజీనామా చేస్తామని, పనులు చేసుకోండని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ నల్ల కండువా కౌన్సిల్ టేబుల్‌పై వేసి నిరసన తెలిపారు.
ఇది కూడా చదవండి..: Tadkol Chowrasta Safety | బాలిక మృతితో స్పందించిన అధికారులు.. ప్రమాదాల నివారణకు చర్యలు