Krait Snake Bite | కట్లపాము కాటుకు గురైన బాలుడికి జీజీహెచ్​లో అరుదైన చికిత్స

కట్లపాము కాటుకు గురైన తొమ్మిదేళ్ల బాలుడికి జీజీహెచ్​లో అరుదైన చికిత్స నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Krait Snake Bite | కట్లపాము కాటుకు గురైన తొమ్మిదేళ్ల బాలుడికి జీజీహెచ్​ (GGH)లో అరుదైన చికిత్స నిర్వహించారు. ఈ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్​ మంగళవారం వివరాలు వెల్లడించారు.

Krait Snake Bite | ఈ నెల  6న..

అక్టోబర్ 6వ తేదీన తెల్లవారుజామున బాలుడు ఇంట్లో కట్లపాము కాటుకు గురయ్యాడు. దీంతో నరాల బలహీనత (న్యూరోటాక్సిసిటీ), కనురెప్పలు వాలిపోయే (ప్టోసిస్) లక్షణాలతో జీజీహెచ్​లో చేరాడు. ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో, పరిస్థితి విషమించకుండా వైద్య బృందం తక్షణమే స్పందించింది. ​చిన్నారికి అత్యవసరంగా 20 యాంటీ స్నేక్ వెనమ్ (ASV) డోసులతో పాటు అట్రోపిన్, నియోస్టిగ్మైన్ మందులను అందించారు.

Krait Snake Bite | చికిత్సకు స్పందించిన శరీరం

శ్వాసక్రియను మెరుగుపర్చేందుకు వెంటనే మెకానికల్ వెంటిలేషన్‌పై ఉంచి వైద్యులు నిరంతరం పర్యవేక్షించారు. అన్ని రకాల సంప్రదాయ, సమగ్ర వైద్య విధానాలను అందించడంతో, చికిత్సకు చిన్నారి శరీరం సానుకూలంగా స్పందించింది. ఆస్పత్రిలో చేరిన మూడో రోజున చిన్నారికి స్పృహ రాగా, నాలుగో రోజున వెయింటిలేటర్ సపోర్టును విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం చిన్నారి నరాల సంబంధిత సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్నారని, పల్స్, బీపీ వంటి కీలక సంకేతాలు (వైటల్స్) స్థిరంగా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. సమయానికి తగిన వైద్యం అందించడం వల్లే చిన్నారి కోలుకున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఆస్పత్రి వైద్యులు పీడియాట్రిక్స్​ విభాగాధిపతి ప్రొఫెసర్లు శ్రీకాంత్​, వెంకటేశ్వర్లు, అసిస్టెంట్​ ప్రొఫెసర్​ కీర్తిని జీజీహెచ్​ సూపరింటెండెంట్​ రాములు అభినందించారు.

ఇది కూడా చదవండి..: Dasara Safety Tips | దసరా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *