అక్షరటుడే, వెబ్‌డెస్క్: Girl Murder Case | మహారాష్ట్ర (Maharashtra)లోని పూణే జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసి ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తారు. ఆమె మంగళవారం అనారోగ్య కారణాలతో పాఠశాలకు వెళ్లలేదు. మధ్యాహ్న సమయంలో బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడాన్ని నిందితుడు ఆసరాగా చేసుకుని, ఆమెపై అత్యాచారం చేసి, ఆపై గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని వాగు సమీపంలో పడేశాడు. ఇంట్లో బాలిక కనిపించకపోవడంతో, కుటుంబ సభ్యులు, బంధువులు వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Girl Murder Case | సీసీ ఫుటేజీ ఆధారంగా..
బాలిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజీ పరిశీలించగా.. సైకిల్‌పై వెళ్తున్న అనుమానాస్పద వ్యక్తిని గుర్తించారు. దీనిపై ప్రశ్నించినప్పుడు తానే హత్య చేసినట్లు నిందితుడు సాహిల్ ఖైరే అంగీకరించాడు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా ఒక వాగు సమీపంలోని చెట్టు కింద బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ పూణే-నాసిక్ హైవేపై రాస్తారోకో చేశారు.
Girl Murder Case | కఠిన చర్యలు తీసుకోవాలి
ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవార్ పేర్కొన్నారు. పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్‌తో ఆమె ఫోన్లో మాట్లాడారు. సమగ్రంగా విచారణ జరపాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని ఆదేశించారు. ఈ కేసును ఫాస్ట్-ట్రాక్ కోర్టులో విచారించేలా చూడాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తానని తెలిపారు.
ఇది కూడా చదవండి..: ED Raids Azam Khan | ఎస్పీ లీడర్ ఆజంఖాన్ యూనివర్సిటీపై ఈడీ దాడులు