Vijay Oath Delay | విజయ్‌ ప్రమాణస్వీకారంపై అనిశ్చితి.. రేపు ఓథ్​ లేదన్న లోక్‌భవన్‌

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Oath Delay | టీవీకే అధినేత విజయ్‌ ప్రమాణస్వీకారంపై కొనసాగుతున్న ఉత్కంఠకు మరో మలుపు తిరిగింది. రేపు విజయ్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం లేదని లోక్‌భవన్‌ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మద్దతు లేఖలు గవర్నర్‌కు ఇంకా అందలేదని సమాచారం.

Vijay Oath Delay | 116 మంది ఎమ్మెల్యేల మద్దతు

ప్రత్యేకంగా IUML, VCK పార్టీల నుంచి మద్దతు లేఖలు రాజ్‌భవన్‌కు చేరలేదని తెలుస్తోంది. ప్రస్తుతం 116 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖ మాత్రమే గవర్నర్‌కు అందిందని లోక్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 117 కావడంతో, ఒక్క సభ్యుడి మద్దతు ఇంకా తక్కువగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ నుంచి ఆహ్వానం లభించలేదు.

ఇక మద్దతు లేఖల కోసం టీవీకే నేతలు మిత్రపక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. తమిళనాడు రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Inter Board Merger | ఇంటర్​ బోర్డు విలీనం ప్రతిపాదన.. విద్యా సంస్కరణా..? లేక విద్యా వ్యవస్థపై ప్రయోగమా..?

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *