అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Parvesh Verma Slap Video | ఢిల్లీ మంత్రి (Delhi Minister) పర్వేష్ వర్మ సహనం కోల్పోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడిపై చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంత్రి పర్వేష్ వర్మ ఆదివారం రోడ్లను తనిఖీ చేశారు. ఆయనతో పాటు తిలక్‌నగర్ ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ సైతం ఉన్నారు. ఆ ప్రాంతంలో వేసిన రోడ్డు నాణ్యత సరిగ్గా లేదని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అధ్వానంగా ఉన్న రోడ్డును చేతితో తవ్వి చూయించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిని ఎమ్మెల్యే పీఏ వీడియో తీస్తుండటంతో మంత్రి ఒక్కసారిగా సహనం కోల్పోయారు. ఆయన చేతిలో ఫోన్ లాక్కొని చెంపపై కొట్టారు. మంత్రి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Parvesh Verma Slap Video | రెచ్చగొట్టడంతోనే..
ఈ వివాదంపై (Parvesh Verma Slap Video) మంత్రి పర్వేష్ వర్మ స్పందించారు. ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ కార్యకర్తలలో ఒకరు తన కుటుంబాన్ని దూషించారని ఆరోపించారు. దీంతో తాను కోపంతో స్పందించానని పేర్కొన్నారు. ఆప్ (AAP) ఈ చెంపదెబ్బ వీడియోను ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. సదరు ఆప్ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆ వీడియో వెనుక ఉన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.
Slap caught on camera. Two very different versions of what triggered it!
Delhi PWD Minister Parvesh Verma is seen slapping a youth during a road inspection in Tilak Nagar
The youth says he was only flagging a damaged road. Verma says he abused his family: “I reacted in the heat… pic.twitter.com/Ygqe1pKEWa
— Nabila Jamal (@nabilajamal_) September 27, 2026
దీనిని కూడా చదవండి : Asian Games 2026 | ఆసియా గేమ్స్‌లో భారత్ జోరు..