Bengaluru Airport Jobs | బెంగళూరు ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాల్లో కన్నడిగులకే ప్రాధాన్యం : సంస్థ కీలక ప్రకటన

రాబోయే ఏడాది కాలంలో స్థానిక అభ్యర్థుల నియామకాల సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bengaluru Airport Jobs | బెంగళూరు Bengaluru అంతర్జాతీయ విమానాశ్రయంలో స్థానిక కన్నడిగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై గత కొంతకాలంగా నెలకొన్న ఆందోళనలకు విమానాశ్రయ మేనేజ్‌మెంట్ స్వస్తి పలికింది. ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇప్పటికే సిబ్బందిలో మెజారిటీ భాగం కన్నడిగులే ఉన్నారని అధికారికంగా ప్రకటించింది.

Bengaluru Airport Jobs | కన్నడ రక్షణ వేదిక విజ్ఞప్తికి సానుకూల స్పందన

విమానాశ్రయంలో స్థానికులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ కన్నడ రక్షణ వేదిక చేసిన విజ్ఞప్తులకు విమానాశ్రయ యజమాన్య సంస్థ సానుకూలంగా స్పందించింది. రాబోయే ఏడాది కాలంలో స్థానిక అభ్యర్థుల నియామకాల సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.

Bengaluru Airport Jobs | 14 భాగస్వామ్య సంస్థలతో చర్చలు

ఈ నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి విమానాశ్రయ పరిధిలోని 14 భాగస్వామ్య సంస్థలతో కలిసి స్థానిక ఉపాధి కల్పన అంశంపై ప్రత్యేక చర్చలు నిర్వహించారు. కర్ణాటక అభివృద్ధిలో, విమానాశ్రయ పురోగతిలో రాష్ట్ర ప్రజల భాగస్వామ్యం, కన్నడ సంస్కృతి అత్యంత కీలకమని సంస్థ స్పష్టం చేసింది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *