Neetu Bai Arrest | 9 ఏళ్లుగా గంజాయి దందా.. భారీగా ఆస్తులు.. మోస్ట్​ వాంటెడ్​ నీతుబాయి అరెస్ట్​

గంజాయి కేసుల్లో మోస్ట్​ వాంటెడ్​గా ఉన్న నీతుబాయిని ఈగల్ ఫోర్స్​ అరెస్ట్ చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Neetu Bai Arrest | హైదరాబాద్​ నగరంలో 9 ఏళ్లుగా గంజాయి దందా చేస్తున్న ఓ మహిళ రూ.కోట్లు సంపాదించింది. ఆ డబ్బులతో పలు ప్రాంతాల్లో భవనాలు నిర్మాణం చేసింది. అనేక కేసుల్లో నిందితురాలైన ఆమెను తాజాగా ఈగల్​ ఫోర్స్​ అరెస్ట్ చేసింది.

నానక్‌రామ్‌గూడకు చెందిన కలపతి నీతు బాయి (51)ని ఈగల్​ ఫోర్స్​ అదుపులోకి తీసుకుంది. 2017 నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె గంజాయి వ్యాపారం చేస్తోంది. ఇతరుల నుంచి గంజాయి కొనుగోలు చేసి, దానిని చిన్న చిన్న ప్యాకెట్లలో ఉంచి విక్రయాలు చేపడుతోంది. నానక్​రామ్​గూడ చుట్టు పక్కత ప్రాంతాల్లో ఆమె గంజాయి అమ్మేది. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు నీతుబాయి దగ్గర కొనుగోలు చేసేవారు.

Neetu Bai Arrest | అరెస్ట్ అయినా..

గంజాయి వ్యాపారంతో వచ్చిన డబ్బులతో నీతూబాయి భారీగా ఆస్తులు కొనుగోలు చేసింది. లంగర్​హౌస్​లో రెండు జీ+3 భవనాలు, గచ్చిబౌలిలోని ఒక జీ+2 భవనం, ఇతర ఆస్తులు మాదకద్రవ్యాల నిధులతో సంపాదించినవిగా అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో ఆమెను పలుమార్లు అరెస్ట్ చేసినప్పటికి, బెయిల్​పై విడుదలై మళ్లీ గంజాయి అమ్మకాలు చేపడుతోంది. నీతూబాయి పోలీసులకు చిక్కకుండా తరచూ తన నివాసాలను మార్చేది. ఈ క్రమంలో శుక్రవారం ఆటోలో మంగళహాట్ వైపు వెళ్తుండగా హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ అధికారులు, ఈగల్ ఫోర్స్ సాంకేతిక బృందం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Neetu Bai Arrest | కుటుంబ సభ్యుల సహకారం

నీతుబాయికి గంజాయి వ్యాపారంలో కుటుంబ సభ్యులు సహకరిస్తున్ఆరు. 2023లో ఆమె కుమారుడు 22 కేజీల గంజాయిని తరలిస్తుండగా దొరికాడు. ఈ కుటుంబానికి సంబంధించిన గతంలో పోలీసులు రూ.67 లక్షల నగదు, 51.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నీతుబాయి, ఆమె కుటుంబంపై 30 డ్రగ్స్​ కేసులు ఉన్నాయి. 13 కేసులలో ఆమె పరారీలో ఉంది. తాజాగా ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు రూ. 1.59 లక్షల నగదు, నోట్లు లెక్కించే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె నివాసానికి వస్తున్న సుమారు 50 మంది కస్టమర్లను సైతం అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిని రిమాండ్​కు తరలించారు.

దీనిని కూడా చదవండి : Police Extortion | అరెస్ట్ చేస్తామని బెదిరించి రూ.50 వేలు వసూలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *