Work From Park | ఇక వర్క్​ ఫ్రం పార్క్​.. సైబరాబాద్​ కార్పొరేషన్​ ప్రతిపాదనలు

ఐటీ ఎంప్లాయిస్​, ఇతర ఉద్యోగులు ఇక నుంచి పార్కుల నుంచి కూడా పని చేయొచ్చు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Work From Park | ఐటీ ఎంప్లాయిస్​, ఇతర ఉద్యోగులు ఇక నుంచి పార్కుల నుంచి కూడా పని చేయొచ్చు. వర్క్​ ఫ్రమ్​ హోమ్​ లాగే.. వర్క్​ ఫ్రమ్​ పార్క్​ చేసేలా సైబరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పార్కులను అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ఉచిత వై-ఫై, పవర్ అవుట్‌లెట్లు, కూర్చునే ఏర్పాట్లు, కాఫీ కియోస్క్‌లతో కూడిన ప్రత్యేక ఏర్పాట్లను పార్కులలో సమకూర్చనుంది. ఇవి అమలులోకి వస్తే సైబరాబాద్​ వాసులు పార్కుల నుంచి సైతం పనులు చేసుకోవచ్చు. సైబరాబాద్ వ్యాప్తంగా 300 కొత్త పార్కులను అభివృద్ధి చేయాలని అధికారులు సంకల్పించారు. పార్కులను నడక, వ్యాయామం, వినోదానికి మాత్రమే పరిమితం చేయకుండా, వాటిలో కొన్నింటిని ఫ్రీలాన్సర్లు, విద్యార్థులు, స్టార్టప్ బృందాలు, రిమోట్ వర్కర్ల కోసం అనధికారిక ఆఫీసులుగా ఉపయోగపడేలా చేయాలని కార్పొరేషన్ భావిస్తోంది.

Work From Park | ఈ సౌకర్యాలు

ఆయా పార్కుల్లో సౌకర్యవంతంగా పనిచేయడానికి సీట్లు, బెంచీలు ఏర్పాటు చేస్తారు. ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల కోసం పవర్ అవుట్‌లెట్లు అమరుస్తారు. ఉచిత వై-ఫై కనెక్టివిటీ, వినియోగదారుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు పెడతారు. కాఫీ, స్నాక్స్ కియోస్క్‌లతో పాటు విరామాలు, వినోదం కోసం వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Work From Park | ఈ ప్రాంతాల్లో ..

శేరిలింగంపల్లి జోన్​లోని మాధవ హిల్స్ కాలనీ, మసీద్ బండా, కూకట్​పల్లి జోన్​లోని మాదాపూర్​లో కొత్త పార్కులను అభివృద్ధి చేయాలని సీఎంసీ యోచిస్తోంది. మాధవ హిల్స్ కాలనీలో, ప్రతిపాదిత పార్క్ సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. ఇందులో దాదాపు 700 చదరపు గజాల స్థలాన్ని కార్యస్థలం కోసం కేటాయించారు. ఈ పార్కులు అందుబాటులోకి వస్తే ప్రజలకు ఆఫీసులు, ఇళ్లు కాకుండా ప్రశాంత వాతావరణంలో పని చేసుకునే అవకాశం కలగనుంది.

దీనిని కూడా చదవండి : Water Wastage | తాగునీటితో ఫ్లోర్​ క్లీనింగ్​.. రూ.20 వేల జరిమానా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *