Kedarnath Landslide | కేదార్​నాథ్​లో విరిగిపడిన కొండచరియలు

ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి, పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kedarnath Landslide | ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రుద్రప్రయాగ్‌లో కొండచరియలు విరిగిపడటంతో చార్ ధామ్ యాత్రను నిలిపివేశారు. ప్రభావిత ప్రాంతానికి ఇరువైపులా సుమారు 4 వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. రోడ్డుపై శిథిలాలలను తొలగిస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పనులు సాగడం లేదు. దీంతో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కేదార్‌నాథ్ యాత్రను అధికారులు నిలిపివేశారు. హెలికాప్టర్ సేవలు సైతం రద్దు చేశారు.

Kedarnath Landslide | బద్రీనాథ్ హైవేపై..

రుద్రప్రయాగ్‌లోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై ధారి దేవి ఆలయం సమీపంలోని కొండపైనుంచి భారీగా శిథిలాలు, బండరాళ్లు పడ్డాయి. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. కొండలపై నుంచి నిరంతరం మట్టి, రాళ్లు పడుతుండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిథోరగఢ్ జిల్లాలోని మున్నా బంద్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అధికారులు 500 మంది ప్రయాణికులను సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేర్చారు.

Kedarnath Landslide | ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు

భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌లోని అలకనంద, మందాకిని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆదివారం అలకనంద నది నీటి మట్టం 626.100 మీటర్లుగా, మందాకిని నది నీటి మట్టం 625.100 మీటర్లుగా నమోదైంది. రెండు నదుల నీటి మట్టాలు పెరుగుతుండటంతో, నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు హెచ్చరించారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.

దీనిని కూడా చదవండి : Godavari Flood | ఉగ్రరూపం దాల్చిన గోదావరి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *