అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Flood Funds | పట్టణాన్ని వరదలు ముంచెత్తి సరిగ్గా ఏడాది గడుస్తోందని.. ఇప్పటికీ వరద నిధులు జాడ ఏమైందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జీఆర్ కాలనీ వద్ద మెడలో నల్ల కండువాలతో ఆందోళన చేపట్టారు.
Kamareddy Flood Funds | సీఎం హామీ ఇచ్చినా.
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. గతేడాది ఆగస్టు 27 కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి (Kamareddy) పట్టణం మొత్తం ఆగమైందన్నారు. వరదల ఉధృతి తగ్గించడం కోసం ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి డివైడర్ కూల్చేశాడన్నారు. సీఎం వచ్చి శాశ్వత పనులు చేయిస్తానని, 15 రోజుల్లో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించి నివేదిక తెప్పించుకుని నిధులు మంజూరు చేస్తానని చెప్పారని, ఇప్పటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కూలిపోయిన శిథిలాలు ఇప్పటికి వెక్కిరిస్తున్నాయన్నారు. సీఎం నా జేబులో ఉంటాడని, హాస్టల్లో ఇద్దరం మిత్రులమని చెప్పుకునే ఎమ్మెల్యే ఎక్కడున్నాడని ప్రశ్నించారు. నీ మిత్రుడు నువ్వు కలిసి డివైడర్ కట్టలేకపోయారని ఎద్దేవా చేశారు.
Kamareddy Flood Funds | తక్షణమే డివైడర్లను నిర్మించాలి
తక్షణమే కూలిపోయిన డివైడర్లను నిర్మించాలని, వరద సాయం ప్రకటించి శాశ్వత పనులు చేపట్టాలని గంపగోవర్ధన్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు, సీఎంను ఎవ్వరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఇది శాంపిల్ మాత్రమేనని, మున్ముందు ఇలాంటివి ఇంకా చూడాల్సి వస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీగా, ప్రజల పక్షాన పోరాడతామని, కెవీఆర్, షబ్బీర్ అలీ, సీఎం జాగ్రత్త అని హెచ్చరించారు. ధర్నా సందర్భంగా పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించే యత్నం చేశారు. బీఆర్ఎస్ నాయకులు వినిపించుకోకపోవడంతో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి..: Urea Shortage Farmers | రెండు నిమిషాల్లో యూరియా ఖాళీ.. ఆందోళన చేపట్టిన అన్నదాతలు