Urea Shortage Farmers | రెండు నిమిషాల్లో యూరియా ఖాళీ.. ఆందోళన చేపట్టిన అన్నదాతలు

రెండు నిమిషాల్లో యూరియా స్టాక్​ అయిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Urea Shortage Farmers | రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. యాప్ విధానం రైతులకు సరిగా అర్థం కాకపోవడంతో సకాలంలో యూరియా తీసుకోలేకపోతున్నారు.

Urea Shortage Farmers | తాడ్వాయి సొసైటీలో..

తాడ్వాయి సొసైటీలో మరోసారి యూరియా స్టాక్ రావడంతో రైతులు కోసం ఎగబడ్డారు. యాప్​లో యూరియా (Urea) స్టాక్ ఉన్నట్టు చూపినా.. కేవలం రెండు నిమిషాల్లోనే అయిపోయింది.  యూరియా నో స్టాక్ కనిపించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై సొసైటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. యాప్​ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దాంతో పోలీసులు ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు చేరుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. యూరియా యాప్​లో కాకుండా నేరుగా సొసైటీల ద్వారా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో స్టాక్ వస్తుందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Collector | అర్హుల ఓటు జాబితాలో ఉండేలా చూడాలి : కలెక్టర్ భవేష్ మిశ్రా

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *