అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Arya Vaishya Women | నగరం (Nizamabad)లో శ్రీ వాసవి గ్రేటర్ ఆర్యవైశ్య మహిళా విభాగాన్ని ఎన్నుకున్నారు. వినాయక్‌నగర్‌లో శ్రీ వాసవి గ్రేటర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
Arya Vaishya Women | అధ్యక్షురాలిగా వేదశ్రీ దొంతుల..
వాసవి గ్రేటర్ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా వేదశ్రీ దొంతుల, కార్యదర్శిగా గాదె రూప ఎన్నికయ్యారు. అలాగే కోశాధికారిగా బచ్చు పల్లవి, ఉపాధ్యక్షులుగా మేఘనా రాణి, పద్మ నాగమల్ల, చెన్న వసంత, కట్కం మంజుశ్రీ, మోర దివ్యబాల ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా కవిత, పబ్బ శ్రీదేవి, స్వప్న, సంయుక్త కార్యదర్శులుగా కల్వకుంట్ల సంధ్య, సంధ్య, నిర్వహణ కార్యదర్శిగా నవీన, అడ్వైజర్‌గా లింగ మాలతి ఎన్నికయ్యారు. మహిళా కార్యవర్గ ఎన్నిక కార్యక్రమాన్ని వాసవి గ్రేటర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం, కార్యదర్శిగా చెన్న నందు, క్యాషియర్ మారప్రభు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.
ఇది కూడా చదవండి..: UAE Job Vacancies | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. యూఏఈలో ఉద్యోగావకాశాలు..