Nizamabad Knife Attack | వ్యక్తిగత కక్షలతో కత్తి దాడి.. యువకుడికి గాయాలు

చంద్రశేఖర్ కాలనీలో వ్యక్తిగత కక్షల నేపథ్యంలో కత్తితో దాడి ఘటన చోటుచేసుకుంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nizamabad Knife Attack | నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో వ్యక్తిగత కక్షల నేపథ్యంలో కత్తితో దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో జుబేర్ ఖాన్ (28) అనే యువకుడికి గాయాలయ్యాయి.

Nizamabad Knife Attack | తొడ భాగంలో దాడి

స్థానికంగా అందిన వివరాల ప్రకారం.. చంద్రశేఖర్ కాలనీలో నివాసముంటున్న జుబేర్ ఖాన్‌పై, అతని ఇంటి సమీపంలో నివసించే వసీమ్ (26) వ్యక్తిగత కక్షల కారణంగా కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో జుబేర్ ఖాన్ తొడ భాగంలో కత్తిపోటుకు గురయ్యాడు.

గాయపడిన జుబేర్ ఖాన్‌ను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *