Oct 15 Horoscope | వృత్తిలో మంచి లాభాలు, అద్భుతమైన అవకాశాలు.. ఈ రాశుల వారి దశ తిరిగినట్లే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oct 15 Horoscope | గ్రహాల సంచారం వల్ల ద్వాదశ రాశుల వారి జీవితాల్లో నేడు (గురువారం, అక్టోబరు 15) మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

కొన్ని రాశుల వారికి ఊహించని ధనలాభాలు, కెరీర్‌లో అద్భుతమైన అవకాశాలు లభిస్తే, మరికొందరికి నిత్య జీవితంలో చిన్నపాటి ఒడుదుడుకులు ఎదురయ్యే సూచనలున్నాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సవాళ్లను అధిగమిస్తూ, కుటుంబంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడుకోవడానికి ఇవాళ రాశి ఫలాలు మీకు దిశానిర్దేశం చేస్తాయి.

Oct 15 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: Oct 15 Horoscope | శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం యోగా చేయడం చాలా మంచిది. మీ అంకితభావం, కష్టపడే తత్వానికి కార్యాలయంలో తగిన గుర్తింపు లభిస్తుంది , వృత్తిపరంగా మంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి.

వృషభ రాశి: Oct 15 Horoscope | కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం, మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో చిన్న పొరపాట్లు జరగకుండా మరింత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార రంగంలో ఉన్నవారికి రోజు సాధారణంగా సాగుతుంది. శివలింగానికి పచ్చి పాలను అభిషేకం చేయడం శుభప్రదం.

మిథున రాశి: Oct 15 Horoscope | మీకు నచ్చిన పనులతో రోజంతా సంతోషంగా గడుపుతారు. పిల్లల చదువుల నిమిత్తం కొంత ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇంటి పనులు లేదా సామాజిక సమావేశాలతో బిజీగా ఉంటారు. వైవాహిక జీవితంలో చిన్నపాటి ఒడిదుడుకులు ఎదురుకావచ్చు.

కర్కాటక రాశి: Oct 15 Horoscope | అనుకున్న పనులు విజయవంతం కావడంతో ఉత్సాహంగా ఉంటారు. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. సామాజిక వేడుకల్లో పాల్గొనడం వల్ల ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. ఆఫీసులో మీ విజ్ఞానానికి మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువుల జోక్యం వల్ల చిన్నపాటి అశాంతి తలెత్తవచ్చు.

సింహ రాశి: Oct 15 Horoscope | ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. కుటుంబ సభ్యులతో కొంత ప్రశాంతమైన సమయం గడపుతారు. ముఖ్యమైన విషయాలలో నిపుణుల సలహాలు మీకు సహాయపడతాయి. భాగస్వామి ప్రవర్తన వల్ల ఈరోజు కొంత చికాకు కలగవచ్చు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

కన్యా రాశి: Oct 15 Horoscope | స్నేహితుల ద్వారా మీ ఆలోచనలను మార్చే ప్రత్యేక వ్యక్తి పరిచయం అవుతారు. ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ మీ దూకుడు స్వభావం తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సహకారం వల్లే కార్యాలయంలో బాగా రాణించగలుగుతారు. అతిథుల రాక వల్ల ఇవాళ అనుకున్నట్లు గడవదు.

తులా రాశి: Oct 15 Horoscope | ఇచ్చిన అప్పు తిరిగి రావడంతో మంచి ఆర్థిక లాభం ఉంటుంది. మీ సరదా స్వభావం చుట్టూ ఉన్నవారిని సంతోషపెడుతుంది. ఖాళీ సమయంలో టీవీ సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తారు. మూడో వ్యక్తుల వల్ల చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు.

వృశ్చిక రాశి: సురక్షితమైన పథకాలలో డబ్బును పెట్టుబడి పెట్టడం మంచిది. మీ ప్రేమ బంధం కొత్త శిఖరాలను తాకుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగి మీ పనితీరు ప్రశంసలందుకుంటుంది.

ధనుస్సు రాశి: పిల్లల నుంచి లభించే శుభవార్తలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో సీనియర్ల నుంచి ప్రశంసలు, మద్దతు లభిస్తాయి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా సాగుతుంది.

మకర రాశి: ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ధనం ఖర్చు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. టీమ్‌వర్క్‌ను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఉద్యోగంలో మీ ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు తగిన సమయం దొరుకుతుంది.

కుంభ రాశి: మానసిక దృఢత్వాన్ని పెంచుకోవడం ద్వారా జీవితంలో సంతృప్తి కలుగుతుంది. గత పెట్టుబడుల ద్వారా మంచి లాభాలను అందుకుంటారు. సాధారణ పరిచయస్తులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి. ఆధ్యాత్మిక పుస్తకాల పఠనం వల్ల చక్కని ప్రశాంతత లభిస్తుంది.

మీన రాశి: ఆర్థిక విషయాలలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. సెమినార్లు, ఉపన్యాసాల ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఎంత బిజీగా ఉన్నా మీకోసం కొంత సమయం కేటాయించు కోవడం మంచిది . ఇవాళ మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *