అక్షరటుడే, వెబ్డెస్క్: Free Medical Camp | చద్మల్ తండాలో నిజామాబాద్కు చెందిన శ్రీ భవానీ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీముఖి స్కిన్ కేర్ హాస్పిటల్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
శిబిరంలో డా. శ్రీలత రాథోడ్, డా. ఎన్. మధుకర్ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. అవసరమైన ఆరోగ్య సూచనలు అందిస్తూ, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.
Free Medical Camp | నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం
ఈ సందర్భంగా గ్రామ సర్పంచి బస్సి దేవి సింగ్ నాయక్, ఉప సర్పంచి ప్రవీణ్ నాయక్ అంగోత్ వైద్యులకు, శిబిర నిర్వహణకు సహకరించిన ఆసుపత్రుల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
ఈ సందర్భంగా డా. ఎన్. మధుకర్ మాట్లాడుతూ.. “ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందాలి” అని పేర్కొన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
స్థానికంగా ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.