UAE Job Vacancies | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. యూఏఈలో ఉద్యోగావకాశాలు..

నిరుద్యోగులకు గుడ్​న్యూస్​ ఇది. టామ్​కామ్​ ఆధ్వర్యంలో యూఏఈలో ఉదోగావకాశాలు ఉన్నాయని జిల్లా ఉపాధి కల్పనాధికారిణి వేల్పుల విజేత అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: UAE Job Vacancies | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​ ఇది. టామ్​కామ్​ ఆధ్వర్యంలో యూఏఈ (UAE)లో ఉదోగావకాశాలు ఉన్నాయని జిల్లా ఉపాధి కల్పనాధికారిణి వేల్పుల విజేత అన్నారు.

UAE Job Vacancies | యూఏఈలో షట్టరింగ్​ వడ్రంగులు, స్టీల్​ ఫిక్సర్లు..

తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని తెలంగాణ (Telangana) ఓవరీస్ మాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ఆధర్షంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని నిర్మాణాత్మక (Construction) రంగంలో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వేల్పుల విజేత తెలిపారు. సాధారణ సహాయకులు (General Helpers) ఉద్యోగుల ఉన్నాయని.. నెలకు ఏఈడీ (AED)1,050 (సుమారు రూ.27,080) జీతం ఉంటుందన్నారు. అలాగే షట్టరింగ్ వడ్రంగులు (shuttering Carpenters)ఉద్యోగాలకు నెలకు ఏఈడీ 1,350 (సుమారు రూ.34,830) జీతం ఉంటుందన్నారు. స్టీల్​ ఫిక్సర్ల ఉద్యోగాలకు ఏఈడీలు 1,350 (రూ.34,830/-)లు ఉందని.. మేస్త్రీ పనివారికి ఏఈడీలు 1,350 (రూ.34,830) ఉందని కల్పన తెలిపారు.

UAE Job Vacancies | నిరుద్యోగులకు సదవకాశం..

తెలంగాణలోని అన్ని జిల్లాలలోని ఆశక్తిగల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఆసక్తి గల వారు 08035524946కు మిస్డ్​ కాల్​ ఇవ్వాలని లేదా.. 04023342040 కార్యాలయానికి కాల్​ చేయవచ్చని సూచించారు. వెబ్​సైట్​ www.tomcom.telanagana.gov.inను సంప్రదించవచ్చన్నారు. మరింత సమాచారం కోసం శివాజీనగర్​లోని ఐటీఐ క్యాంపస్​లో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Telangana Police Sports | రాష్ట్రస్థాయి పోలీస్​స్పోర్ట్స్​ను విజయవంతం చేయాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *