అక్షరటుడే, వెబ్డెస్క్: Electric Vehicle Policy | పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం (Central Government) సూచిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు పెట్రోలు ధరల పెంపు, మరో వైపు పొల్యూషన్ నేపథ్యంలో ప్రజలు ఈవీ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది ఎలక్ట్రిక్ కార్లు, స్కూటీలు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.
Electric Vehicle Policy | రూ.20 లక్షలకు పరిమితి పెంపు
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉపయోగించే ప్రభుత్వ, అధికారిక వాహనాల కొనుగోలు కోసం ఆర్థిక శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై అధికారిక అవసరాలకు ఎలక్ట్రిక్ వాహనాలనే (EVs) మొదటి ఎంపికగా చూడాలని స్పష్టం చేసింది. ఈవీ వాహనాల ధర పరిమితి రూ. 20 లక్షలకు పెంచింది. పెట్రోల్, డీజిల్ వాహనాల పరిమితి రూ. 10 లక్షలుగా ఉంది. అంతేగాకుండా అద్దెకు తీసుకునే వాహనాల్లోనూ ఈవీలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. ఈ నిబంధనల ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విద్యుత్ వాహనాలు ఉపయోగించడం సాధ్యపడని సందర్భాల్లో పెట్రోల్, డీజిల్ వాహనాలు కొనుగోలు చేయొచ్చు. అయితే వీటికి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి..: Kashmir Terrorist Search | ఉగ్రవాదుల కోసం జమ్మూకశ్మీర్ పోలీసుల గాలింపు