అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kashmir Terrorist Search | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir) పోలీసులు కశ్మీర్‌లో మిగిలి ఉన్న ఏకైక స్థానిక ఉగ్రవాది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. లాల్ చౌక్, ప్రతాప్ పార్క్ అంతటా అతని పోస్టర్లను అంటించి, అతడిని పట్టుకోవడానికి సహాయం చేయాలని ప్రజలను కోరారు.
ఆ ఉగ్రవాదిపై రూ. 15 లక్షల రివార్డును నాలుగు క్రితమే ప్రకటించారు. అయితే ఇంకా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తాజాగా పోస్టర్లు అతికించారు. కాశ్మీర్ లోయ నుండి ఉగ్రవాదుల చివరి ఆనవాళ్లను కూడా తుడిచిపెట్టే ప్రయత్నంలో భాగంగా, లష్కర్-ఎ-తైబా కార్యకర్త అబ్దుల్ లతీఫ్ భట్ అలియాస్ మహమ్మద్ లతీఫ్ భట్‌తో పాటు మరో ముగ్గురు వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లను పోలీసులు మరోసారి అంటించారు. ఈ వ్యక్తుల ఆచూకీ, కదలికల గురించి ఏదైనా విశ్వసనీయమైన సమాచారం తెలిస్తే ముందుకు రావాలని భద్రతా సంస్థలు పౌరులను కోరాయి. సమాచారం అందించిన వారికి తగిన బహుమతి, పూర్తి గోప్యత కల్పిస్తామని హామీ ఇచ్చాయి.
Kashmir Terrorist Search | లతీఫ్ భట్
దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాంకు చెందిన మహమ్మద్ లతీఫ్ భట్ లష్కర్-ఎ-తైబాలో కరడుగట్టిన కార్యకర్త. అనంతనాగ్‌లో ఒక పోలీసు అధికారి హత్యకు సూత్రధారిగా వ్యవహరించాడని పోలీసులు భావిస్తున్నారు. అలాగే జూలై 2026లో వలస కార్మికులను లక్ష్యంగా చేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అతడితో పాటు పీవోకేకు చెందిన మరో ముగ్గురు వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు, వివరాలు విడుదల చేశారు. వారిని బిలాల్ అహ్మద్ మీర్, మహమ్మద్ ఉమర్ మీర్, అబిద్ ఖయూమ్ లోన్‌గా గుర్తించారు.
ఇది కూడా చదవండి..: Train Derailment | పట్టాలు తప్పిన రైలు.. ప్రయాణికులు సురక్షితం