Train Derailment | పట్టాలు తప్పిన రైలు.. ప్రయాణికులు సురక్షితం

సైరంగ్-కోల్‌కతా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. అస్సాంలోని దిగారు రైల్వేస్టేషన్​ సమీపంలో ఈ ఘటన జరిగింది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Train Derailment | కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. గౌహతి సమీపంలోని దిగారు రైల్వే స్టేషన్ వద్ద రైలు లోకోమోటివ్, ఐదు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని రైల్వే శాఖ (Railway Department) ధృవీకరించింది. ప్రయాణికులను ప్రత్యామ్నాయ రైలులో గమ్యస్థానానాలకు తరలిస్తున్నారు.

Train Derailment | రైలు వేగాన్ని నియంత్రించే క్రమంలో..

దిగారు రైల్వే స్టేషన్‌ సమీపంలో లోకో పైలట్ రైలు వేగాన్ని నియంత్రించే క్రమంలో పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రైల్వే అధికారులు వెంటనే స్పందించి, ఘటనా స్థలంలో సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను ప్రారంభించారు. పునరుద్ధరణ పనులను పర్యవేక్షించేందుకు రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Train Derailment | ప్రయాణికులు సురక్షితం

ఘటన జరిగిన సమయంలో కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎటువంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు ధృవీకరించారు. ప్రత్యామ్నాయ రైలు ద్వారా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. రైలు పట్టాలు తప్పిన వెంటనే సహాయక, రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభించారు. ప్రభావిత ప్రాంతంలో రైల్వే అధికారులు పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారు.

Train Derailment | రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఘటన కారణంగా ఈ మార్గంలో నడిచే ఇతర రైళ్ల రాకపోకలపై కూడా ప్రభావం పడింది. పలు రైళ్లను మధ్యలో నిలిపివేశారు. రైళ్లు ఎంత సమయం ఆలస్యమవుతాయనే దానిపై ఇంకా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన సాంకేతిక కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Grandson Birthright Grandfather Property | తండ్రికి పంచిన తాత ఆస్తిపై మనవడికి జన్మహక్కు ఉండదు: సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు!

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *