అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | రాఖీ పండుగను పురస్కరించుకుని ప్రజాపిత బ్రహ్మకుమారీలు గురువారం సీపీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్యను కలిశారు.
CP Sai Chaitanya | శాంతియుతంగా జరుపుకోవాలి
బ్రహ్మకుమారీలు పోలీస్ కమిషనర్ (Sai Chaitanya)కు రాఖీ కట్టి , రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో శాంతి భద్రత, సోదరభావం, మానవతా విలువలను పెంపొందించడంలో పోలీస్ శాఖ చేస్తున్న సేవలను వారు కొనియాడారు. రాఖీ పండుగ సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీక అని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలు సోదరభావంతో, శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బ్రహ్మకుమారీలు వనజ, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Flood Funds | ఏడాదైనా వరద నిధుల జాడేది..: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్