అక్షరటుడే, కామారెడ్డి: Car Tree Crash | మాచారెడ్డి మండలం (Machareddy Mandal) కాకులగుట్ట తండా శివారులో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కామారెడ్డి నుంచి గంభీరావుపేటకు వెళ్తున్న కారు ఓ చెట్టును ఢీకొంది.
Car Tree Crash | అర్ధరాత్రి ఒకరు మృతి చెందగా..
ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో అనిల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ఇద్దరిని హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్లో చికిత్స పొందుతున్న ఇద్దరిలో అన్వేష్ గౌడ్ (25) చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు. కాగా మృతి చెందిన అన్వేష్ గౌడ్ గంభీరావుపేటలో ఓ బ్యాంకులో ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ ప్రమాదంలో గాయపడిన మరొక యువకుడు వికాస్ పరిస్థితి మెరుగ్గా ఉందని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Car Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు.. ఒకరి దుర్మరణం.. మరో ఇద్దరి పరిస్థితి విషమం