అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Car Accident | కామారెడ్డి జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మాచారెడ్డి మండలంలోని కాకులగుట్ట తండా సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
Kamareddy Car Accident | స్వగ్రామానికి వెళ్తుండగా ..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంబీరావుపేట గ్రామానికి చెందిన స్నేహితులు దుంపల వికాస్, బంగ్లా అన్వేష్ గౌడ్, కోట అనిల్ (22) శుక్రవారం పనిమీద కామారెడ్డికి వచ్చారు.
పని ముగించుకుని కారులో తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మాచారెడ్డి–ముస్తాబాద్ రహదారిపై కాకులగుట్ట తండా సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు కాగా, అందులో ఇరుక్కున్న కోట అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. వికాస్, అన్వేష్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డారు.
Kamareddy Car Accident | హైదరాబాద్‌కు తరలింపు
సమాచారం అందుకున్న మాచారెడ్డి పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని తొలుత కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
మృతుడు అనిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
చనిపోయిన Anil దుబాయి వెళ్లి ఇటీవలే వచ్చినట్లు సమాచారం. ఇక అన్వేష్ గౌడ్ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగిగా తెలిసింది. వికాస్‌ను విద్యార్థిగా గుర్తించారు.