Hello Upasarpanch Program | ‘హలో ఉపసర్పంచ్–చలో హైదరాబాద్’ పోస్టర్ల ఆవిష్కరణ

ఉపసర్పంచుల సమస్యల పరిష్కారం కోసం ‘హలో ఉపసర్పంచ్–చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉపసర్పంచ్​ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్​ పేర్కొన్నారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, మెండోరా : Hello Upasarpanch Program | ఉపసర్పంచుల సమస్యల పరిష్కారం కోసం ‘హలో ఉపసర్పంచ్–చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉపసర్పంచ్​ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్​ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్​ చౌరస్తాలో జిల్లా ఇన్​ఛార్జి మహేష్​తో కలిసి బుధవారం పోస్టర్లను ఆవిష్కరించారు.

Hello Upasarpanch Program | ఉప సర్పంచ్​ల చెక్​పవర్​పై వార్తలు..

ఆయన మాట్లాడుతూ.. ఈనెల 25న హైదరాబాద్‌ (Hyderabad)లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ముందుగా అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ఉపసర్పంచుల చెక్ పవర్‌పై వస్తున్న వార్తలను ప్రభుత్వం వెంటనే ఖండించాలని, ఉపసర్పంచులకు నెలకు రూ.5,000, వార్డు సభ్యులకు రూ.3,000 గౌరవ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉపసర్పంచుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో హైదరాబాద్‌లో జరిగే ధర్నాలో పాల్గొనాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మెండోరా మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు బద్దం శ్రీనివాస్, సంపంగి సతీష్, రాజ్‌కుమార్, సతీష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Division Problems Resolution | డివిజన్లలో సమస్యల పరిష్కారానికి కృషి..: మేయర్​ ఉమారాణి

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *