Harish Rao Allegations | హరీశ్​రావుకు మంత్రులు పొన్నం, అడ్లూరి కౌంటర్​

హరీశ్​రావుకు మంత్రులు పొన్నం ప్రభాకర్​, అడ్లూరి లక్ష్మణ్​ కౌంటర్​ ఇచ్చారు. కరీంనగర్​ వారు బుధవారం మాట్లాడారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao Allegations | గురుకుల పాఠశాలల (Gurukul Schools) టెండర్లలో భారీ స్కామ్​ జరిగిందని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆయనకు మంత్రులు పొన్నం ప్రభాకర్​, అడ్లూరి లక్ష్మణ్​ కౌంటర్​ ఇచ్చారు. కరీంనగర్​ వారు బుధవారం మాట్లాడారు.

కరీంనగర్ (Karimnagar) జిల్లా రాజకీయాల్లో గతంలో వెంకట్ స్వామి, చొక్కారావు ఎలాంటి రాజకీయాలు చేశారో ఇప్పుడు తాను, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అలాంటి రాజకీయాలు చేస్తున్నామని పొన్నం ప్రభాకార్​ అన్నారు. రాజకీయాల్లో ఆదర్శంగా ఉన్నామని చెప్పారు. సంక్షేమ శాఖల్లో మొత్తం సెంట్రల్ ప్రొక్యూర్ మెంట్ టెండర్లు 2000 కోట్లు కానప్పుడు 2 వేల కోట్ల స్కాం జరిగిందని ఎలా అంటారని ప్రశ్నించారు.

Harish Rao Allegations | దేనికైనా సిద్ధం

తాము పారదర్శకంగా ఉన్నామని పొన్నం తెలిపారు. అవినీతి చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. అసత్య ఆరోపణలు చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు తొలగించాలని ఎస్​ఐఆర్​ తీసుకొచ్చారని విమర్శించారు. తమపై ఎవరు వేలు ఎత్తి చూపెట్టే అవకాశం ఇవ్వమన్నారు. బీజేపీ (BJP) అనుకూలంగా ఎన్నికల సంఘం పని చేస్తోందని ఆరోపించారు. అర్హుల ఓట్లను తొలగించకుండా ఎస్​ఐఆర్​ చేపడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్​ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఏమీ లేదన్నారు. రూ .2 వేల కోట్ల స్కామ్ అంటూ అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Harish Rao Allegations | బస్సులో ప్రయాణించిన మంత్రులు

వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కరీంనగర్ ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆర్టీసీ బస్సులో మంత్రులు పొన్నం ప్రభాకర్​, అడ్లూరి లక్ష్మణ్​ ప్రయాణించారు. ప్రయాణికులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తున్నామని కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిందని ఎన్నికలు పూర్తికాగానే గెలిచిన సంఘము నాయకులతో అధికారుల కమిటీలో విలీనం ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Rythu Bharosa Funds | అన్నదాతలకు గుడ్​న్యూస్​.. త్వరలో రైతు భరోసా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *