Gandhari DJ Permission Protest | డీజే అనుమతి కోసం గ్రామస్తుల ధర్నా.. గాంధారిలో ట్రాఫిక్​ జాం

దుర్గామాత శోభాయత్రలో డీజేకు అనుమతి ఇవ్వకపోవడంతో భక్తులు ధర్నాకు దిగారు.

shashi kiran Mottala

అక్షరటుడే, గాంధారి: Gandhari DJ Permission Protest | దుర్గాదేవి శరన్నవరాత్రులు ముగిసిన సందర్భంగా మండల కేంద్రంలో దుర్గామాత విగ్రహంతో స్వాములు, గ్రామస్తులు శోభాయాత్ర నిర్వహించారు. అయితే యాత్రలో భాగంగా పోలీసులు డీజేకు అనుమతి ఇవ్వలేదు.

Gandhari DJ Permission Protest | నాలుగు గంటలుగా ట్రాఫిక్​జాం..

దీంతో గ్రామస్తులు రోడ్డుపై ధర్నాకు దిగారు. యాత్ర సందర్భంగా డీజేకు అనుమతివ్వాలని గ్రామస్తులు కోరగా పోలీసులు నిరాకరించారు. చిన్నబాక్స్​కు మాత్రమే ఎస్సై మహేందర్​ అనుమతించారు. కానీ గ్రామస్తులు డీజే కావాలని పట్టుబట్టి ధర్నాకు దిగడంతో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆ ప్రాంతంలో ట్రాఫిక్​ జాం ఏర్పడింది. ఈ క్రమంలో ఎస్సై డీఎస్పీకి గాంధారిలో పరిస్థితిని ఫోన్​లో వివరించారు.

Gandhari DJ Permission Protest |

ఇది కూడా చదవండి: ట్రైన్‌ జర్నీలో ఫోన్​ స్పీకర్​ ఆన్​చేస్తున్నారా.. జైలుకి వెళ్లడం పక్కా..! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *