Jakora Chandur Lift Irrigation | జాకోర–చందూర్ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి బుధవారం పరిశీలించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Jakora Chandur Lift Irrigation | వర్ని మండలం (Varni Mandal)లోని సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.106 కోట్ల వ్యయంతో నిర్మించిన జాకోర–చందూర్ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు.

Jakora Chandur Lift Irrigation | మంత్రికి స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు

మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, ఎంపీ సురేష్ శెట్కార్ హెలికాప్టర్ ద్వారా సిద్దాపూర్ రిజర్వాయర్ (Siddhapur Reservoir) వద్దకు బుధవారం మధ్యాహ్నం చేరుకున్నారు. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్ కాసుల బాలరాజు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi), ఎస్పీ రాజేష్ చంద్ర తదితరులు స్వాగతం పలికారు. మంత్రి రాక సందర్భంగా రిజర్వాయర్ పరిసర ప్రాంతం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై మంత్రికి స్వాగతం పలికారు. మహిళలు పూలు జల్లుతూ ఆహ్వానించగా, కార్యకర్తల నినాదాలతో ప్రాంతం మార్మోగింది.

Jakora Chandur Lift Irrigation | సిద్దాపూర్​ రిజర్వాయర్​ నిర్మాణ పనుల పరిశీలన..

Jakora Chandur Lift Irrigation

మంత్రి సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించి, ప్రాజెక్టు పురోగతి, నిర్మాణ నాణ్యత, ఎదురవుతున్న సమస్యలు, పనుల గడువు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.106 కోట్లతో నిర్మించిన జాకోర–చందూర్ ఎత్తిపోతల పథకాలను మెయిన్ స్విచ్ ఆన్​చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్టు వివరాలను మంత్రికి వివరించారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే పరిసర ప్రాంతాల రైతులకు సాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడటంతో పాటు వ్యవసాయాభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Gas Leak | వంటగ్యాస్ లీక్‌ ఘటనలో ముగ్గురికి గాయాలు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *