అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Modi Governance Achievements | దేశానికి స్వతంత్య్రం వచ్చాక తొలి సాధారణ ఎన్నికలను 1952లో నిర్వహించారు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన అప్పటినుంచి 1964 మే 27న మరణించే వరకు 4,398 రోజుల పాటు ప్రధానిగా నిరంతరాయంగా ఉన్నారు.
నిన్నటివరకు ఇదే రికార్డు.. దీనిని ప్రస్తుత ప్రధాని మోదీ అధిగమించారు. 2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ (Lok Sabha elections) వరుస విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో బుధవారంతో ఆయన ప్రధానిగా 4,399 రోజుల పాలన మార్క్‌ను చేరుకుని సరికొత్త చరిత్ర లిఖించారు. ఈ పుష్కర కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఆయన.. అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు.
Modi Governance Achievements | గణనీయమైన అభివృద్ధి..
మోదీ పదవీకాలం నెహ్రూ కంటే ఎక్కువగా ఉండటమనేది కేవలం సంఖ్యాపరమైన రికార్డు కాదు; మోదీ (PM Modi) హయాములోనే స్వతంత్ర భారతం సరికొత్త అధ్యాయంలోకి ప్రవేశించిన విషయాన్ని ఇక్కడ గమనించాలి. మోదీ పాలన కాలంలో భారతదేశం తన ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని రెట్టింపు చేసింది. భారీ స్థాయిలో రహదారులు మరియు రైల్వేలను నిర్మించారు. సంక్షేమ పథకాల పరిధిని విస్తరించారు. డిజిటల్ విప్లవం సృష్టించారు. యÖపీఐ విధానం ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలలో ఒకదానిగా గుర్తింపు పొందింది.
Modi Governance Achievements | డిజిటల్ విప్లవం..
ఆధార్, యÖపీఐ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌లతో కూడిన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్థిక వ్యవస్థను ఫార్మలైజ్ చేసింది. ఈ ఏడాది జనవరిలో 21.70 బిలియన్ లావాదేవీలు యÖపీఐ ద్వారా జరిగాయి. ఇది ప్రపంచ రియల్‌టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 49 శాతం కావడం గమనార్హం. డిజిటల్ లావాదేవీలు ఎఫ్ వై 16లో జీడీపీ 4.4 శాతం నుంచి ఎఫ్ వై 23లో 76.1 శాతానికి పెరిగాయి.
Modi Governance Achievements | సంక్షేమ కార్యక్రమాలు..
ప్రధాని మోదీ సంక్షేమానికీ ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద 55 కోట్లకు పైగా బ్యాంక్ ఖాతాలు తెరిచారు. ఉజ్వల యోజన కింద 9 కోట్లకు పైగా కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చారు. గ్రామీణ ట్యాప్ వాటర్ కవరేజ్ 17 శాతంనుంచి 80 శాతానికి పెరిగింది. రైతులకు ఏటా మÖడు విడతల్లో కలిపి రూ. 6 వేల చొప్పున అందిస్తున్నారు.
ఎగుమతులు..
భారత్ ఎగుమతులు 2013-14లో 466.22 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2023-24 నాటికి 778.21 బిలియన్ డాలర్లక£” పెరిగాయి. ఇదే సమయంలో రక్షణ ఎగుమతుల్లోనూ దూకుడు పెరిగింది. రక్షణ ఎగుమతులు 2013-14లో రూ. 700 కోట్లు ఉండగా.. ఎఫ్ వై 25 నాటికి రూ. 23 వేల కోట్లకు చేరాయి.
Modi Governance Achievements | ఆర్థిక వ్యవస్థ పరిమాణం రెట్టింపు
2014లో మోదీ తొలిసారిగా అధికారం చేపట్టినప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ విలువ సుమారుగా 2 ట్రిలియన్ డాలర్లుగా ఉండేది. ఇప్పుడది రెట్టింపై 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. జీడీపీ 2.1 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.3 ట్రిలియన్ డాలర్లక£” చేరింది. గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ తాత్కాలిక అంచనాల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతంతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ 7.7 శాతం వృద్ధి చెందింది. నామమాత్రపు జీడీపీ రూ. 346.36 లక్షల కోట్లకు పెరిగింది. ఈ క్రమంలో భారతదేశం జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
Modi Governance Achievements | మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత

రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లు దీర్ఘకాలిక ఆర్థిక సామర్థ్యాన్ని సృష్టిస్తాయని మరియు ప్రైవేట్ పెట్టుబడులకు మద్దతు ఇస్తాయని ప్రభుత్వం వాదిస్తోంది. దీంతో వరుస బడ్జెట్లలో మూలధన వ్యయం పెంచుతూ వస్తున్నారు. పబ్లిక్ క్యాపెక్స్ ఎఫ్ వై 15లో సుమారు రూ. 2 లక్షల కోట్లు ఉండగా.. ఎఫ్ వై 27 బడ్జెట్‌లో రూ. 12.2 లక్షల కోట్లకు పెరిగింది. ఇది ఆరు రెట్ల వృద్ధి. రోడ్లు, రైల్వేలు, పోర్టులు, జలమార్గాలు ఈ వ్యయంలో సగానికి పైగా వాటా కలిగి ఉన్నాయి.జాతీయ రహదారుల నెట్‌వర్క్ 2014లో 91,287 కి.మీ. ఉండేది. ఇప్పుడది 1,46,560 కి.మీ.లకు పెరిగింది. రోజుకు 33 కి.మీ. చొప్పున నేషనల్ హైవే నిర్మాణం జరుగుతోంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 2025 ఆర్థిక సంవత్సరంలో 5,600 కిలోమీటర్లకు పైగా, 2026 ఆర్థిక సంవత్సరంలో 5,300 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులను నిర్మించింది.ఇదే కాలంలో ఎయిర్‌పోర్టులు 74 నుంచి 160కి, మెట్రో రైల్ 250 కి.మీ. నుంచిి 1,000 కి.మీ.లకు పెరిగాయి. బ్రాడ్‌గేజ్ విద్యుదీకరణ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 164 వందే భారత్ సర్వీసులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
Modi Governance Achievements | నాటికీ, నేటికీ ఎంత తేడా..
స్వాతంత్య్రానంతరం మొదటి దశాబ్దంనర కాలంలో జరిగిన పరిణామాలకు, గత 12 ఏళ్లలో సాధించిన అభివృద్ధికి మధ్య పెద్ద వ్యత్యాసమే ఉంది. నెహ్రూ హయాంలో భారతదేశం సాంస్కృతికంగా, ఆర్థికంగా పాశ్చాత్య దేశాల సాయం పొందడానికి ఆరాటపడింది. ప్రస్తుతం మోదీ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నో అంతర్జాతీయ సవాళ్లను, అడ్డంకులను తట్టుకుని పురోగమిస్తోంది. పుష్కర కాల పాలనలో భారత్‌ను ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడం, గ్లోబల్ సౌత్‌కు ప్రధాన ప్రతినిధిగా ఎదగడం, అంతర్జాతీయ దౌత్య వేదికలపై కీలక శక్తిగా మారడం వంటి పరిణామాలెన్నో జరిగాయి. నెహ్రూ పాýనా కాలంలో పోలిస్తే ప్రజల ఆకాంక్షలు విపరీతంగా పెరిగాయి. వాటిని నెరవేర్చడం, ప్రజలతో బలమైన విశ్వాస బంధాన్ని నిలుపుకోవడం చాలా కష్టమైన విషయం. కానీ దానిని ప్రధానిగా మోదీ సాధించారు. అందుకే వరుసగా మÖడోసారి గెలవడమే కాకుండా పుష్కర కాలంగా ప్రధాని పదవిలో కొనసాగుతున్నారు.
ఇది కూడా చదవండి..: Jairam Ramesh Criticism | మోదీ సృష్టించిన రికార్డులే దేశానికి సమస్యలుగా మారాయి: జైరాం రమేశ్
