అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chicken Waste | హైదరాబాద్ (Hyderabad) నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా చికెన్ వ్యర్థాల తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. చేపల దాణాగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దాదాపు 100 టన్నుల చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో వేలాది చికెన్ సెంటర్లు ఉన్నాయి. వాటిలో కోళ్లు కోసిన తర్వాత వ్యర్థాలను సరైన రీతిలో డిస్పోజ్ చేయడం లేదు. నగరంలో కొంత మంది చికెన్ సెంటర్ల నుంచి వ్యర్థాలను సేకరించి దందాకు పాల్పడుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, కల్లు కంపౌండ్, పర్మిట్ రూమ్‌లలో దుకాణాలు నిర్వహించే వారికి విక్రయిస్తున్నారు. అంతేగాకుండా అక్రమంగా ఏపీకి సైతం తరలిస్తున్నారు. ఆ రాష్ట్రంలోని చేపల చెరువుల్లో చేపలకు చికెన్ వ్యర్థాలను మేతగా వినియోగిస్తున్నారు.
Chicken Waste | తిన్నారంటే అంతే..
ఇలాంటి వ్యర్థాలతో పెంచిన చేపలను తినడం వల్ల ఆహార భద్రత, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు ఉంటుందని అధికారులు హెచ్చరించారు. దాదాపు 100 టన్నుల కోడి వ్యర్థాలను సైబరాబాద్ పోలీసులు, పశుసంవర్ధక శాఖ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Ganja Seized | హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత