Lalitha Jewellery IPO | ఐపీవోతో డబ్బులొచ్చాయ్!.. భారీ లాభాలను అందించిన లలితా జువెలరీ మార్ట్

‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు’ అన్న ప్రకటనతో ఫేమస్ అయిన లలితా జువెలరీ మార్ట్.. ఐపీవో ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Lalitha Jewellery IPO | చెన్నై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న లలితా జువెలరీ (Lalitha Jewellery) మార్ట్ కంపెనీని 1985 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు’ అన్న ప్రకటనతో ఈ కంపెనీ ప్రజాదరణ పొందింది.

ప్రమోటర్ కిరణ్ కుమార్ స్వయంగా ఈ యాడ్‌లో నటించి, విస్తృతంగా ప్రమోట్ చేశారు. తమ దగ్గర మేకింగ్ చార్జీలు తక్కువగా ఉంటాయని, వేరే సంస్థలతో ధరలను పోల్చి చూసుకున్న తర్వాతే తమ వద్దకు వచ్చి కొనుగోలు చేయాలని సూచించడంతో బహుళ ప్రజాదరణ పొందింది.

Lalitha Jewellery IPO | రూ. 1,700 కోట్ల సమీకరణ..

లలితా జువెలరీ మార్ట్ రూ. 1,700 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. ఇందులో రూ. 1,200 కోట్లు ఫ్రెష్ ఇష్యూ కాగా.. మిగిలినది ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్ కిరణ్ కుమార్ తన వాటాను విక్రయించారు. ఆగస్టు 17 నుంచి 19 వరకు బిడ్లు స్వీకరించారు.

Lalitha Jewellery IPO | మంచి ఆదరణ..

లలితా జువెలరీ మార్ట్ ఐపీవోకు మంచి ఆదరణ లభించింది. మొత్తం ఐపీవో 66.63 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. క్యూఐబీలు 153.80 రెట్లు, ఎన్ ఐఐలు 78.17 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 12.51 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.

Lalitha Jewellery IPO | ఒక్కో షేరుపై రూ. 64 లాభం..

కంపెనీ షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యాయి. ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 201 కాగా.. 31.84 శాతం ప్రీమియంతో రూ. 265 వద్ద లిస్టయ్యింది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలోనే ఒక్కో షేరుపై రూ. 64 లాభం వచ్చిందన్న మాట.

ఇది కూడా చదవండి..: Interio by Godrej | టెక్నాలజీతో ఫర్నిచర్ షాపింగ్‌ను మారుస్తున్న ‘గోద్రెజ్ ఇంటెరియో’..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *