అక్షరటుడే,భీమ్‌గల్(కమ్మర్‌పల్లి): Kammarpally Police | మూర్ఛ వ్యాధితో మనోవేదనకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కమ్మర్‌పల్లి (Kammarpally) మండల పరిధిలోని గాంధీనగర్‌లో చోటు చేసుకుంది.
Kammarpally Police | నయం కాకపోవడంతో..
కమ్మర్‌పల్లి ఎస్సై సీహెచ్ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు (Gandhinagar) చెందిన అశోక్ గత కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. వివిధ ఆస్పత్రుల్లో చూపించినా నయం కాకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యేవాడు. దీంతో మద్యానికి బానిసయ్యాడు. ఆర్థిక ఇబ్బందులు సైతం చుట్టుముట్టాయి. రెండు నెలలుగా ఎలాంటి పనికి వెళ్లకుండా రోజంతా మద్యం తాగుతుండటంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన అశోక్.. శుక్రవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు బయట నిద్రిస్తున్న సమయంలో గదిలోకి వెళ్లి చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఉదయం 6:20 గంటల ప్రాంతంలో భార్య సంధ్య లోపలికి వెళ్లి చూసేసరికి అశోక్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని కిందకు దించినప్పటికీ అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమ్మర్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి: కదులుతున్న వ్యాన్‌లో నుంచి పడిపోయిన విద్యార్థులు