అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nalgonda Family Murder | నల్గొండ జిల్లా కేంద్రంలో (Nalgonda District) ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలు హసీనా మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి సుపారీ గ్యాంగ్‌తో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
నల్గొండలోని సాగర్ రోడ్డులో గల తెలంగాణ కాలనీలో ఎండీ సుల్తాన్ (45), హసీనా (40) దంపతులు, వారి కుమారుడు ముజామిల్ (20), కుమార్తె అక్సర (11) ఇటీవల దారుణ హత్యకు గురయ్యారు. సుల్తాన్ బ్యాగుల వ్యాపారం చేస్తుండగా.. హసీనా ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. వారి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి తలుపులు తెరిచి చూడగా నలుగురి మృతదేహాలు ఉన్నాయి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.
Nalgonda Family Murder | కోటి రూపాయల ఆస్తి కోసం..
హసీనాకు గతంలో రెండు పెళ్లిళ్లు జరిగాయి. అనంతరం నల్గొండకు చెందిన మహ్మద్ సుల్తాన్‌ను మూడో వివాహం చేసుకుంది. సుల్తాన్‌కు సైతం గతంలో రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్య పిల్లలు మహ్మద్ ముజమిల్, అప్సరతో కలిసి సుల్తాన్, హసీనా నల్గొండలో జీవిస్తున్నారు. అయితే హసీనా పేరు మీద కోటి రూపాయల విలువైన స్థలాలు, ఇళ్లు ఉన్నాయి. ఆ ఆస్తిని తమకు ఇవ్వకుండా మూడో భర్త పిల్లల మీద వీలునామా రాస్తున్నట్లు హసీనా చెప్పడంతో మొదటి భర్త కూతురు, అల్లుడు కక్ష పెంచుకున్నారు.
Nalgonda Family Murder | రౌడీ షీటర్లతో..
ఆస్తి తమకు దక్కడం లేదని హసీనా మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి ఆ కుటుంబాన్ని అంతం చేయాలని ప్లాన్ వేశారు. ఈ మేరకు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నలుగురు రౌడీ షీటర్లతో హత్య చేయించారు. నిందితులు ఇంట్లోకి చొరబడి ఆ నలుగురిని దారుణంగా హత్య చేశారు. సుల్తాన్ మృతదేహంపై 6 చోట్ల, హసీనాకు 7 చోట్ల, అక్సరకు 9 చోట్ల, ముజమిల్‌కు ఏకంగా 16 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో గుర్తించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి..: Container Crash House | ఇంట్లోకి దూసుకెళ్లిన కంటైనర్.. ఒకరి మృతి