అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Rain | కామారెడ్డి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో గురువారం భారీ వర్షం (Heavy Rainfall) కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కామారెడ్డిని (Kamareddy) అతలాకుతలం చేసింది. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ డ్రెయినేజీ నీటితో చెరువులను తలపించేలా మారాయి. దాంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. వర్షపు నీటిలో పలు వాహనాలు మునిగిపోయాయి.
Kamareddy Rain | నిజాంసాగర్ చౌరస్తా వద్ద..
ప్రధానంగా నిజాంసాగర్ చౌరస్తా, లయోలా స్కూల్ చౌరస్తా (Loyola School Junction), పాత బస్టాండ్, సిరిసిల్ల రోడ్, విద్యానగర్ కాలనీ, బతుకమ్మ కుంట, పంచముఖి హనుమాన్ కాలనీ ప్రాంతాల్లో రహదారులన్నీ నీటితో నిండిపోయాయి. పట్టణంతో పాటు ఆయా మండలాల్లో భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే (Paddy Damage) ఉండిపోయింది. భారీ వర్షానికి రైతులు ఆగమయ్యారు. ధాన్యం కాపాడుకోవడానికి శతవిధాలా ప్రయత్నించారు.
అయినా రైతులకు ఫలితం దక్కలేదు. కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం కుప్పలు, కాంటా చేసి నింపిన ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. దాంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే ధాన్యం రైస్‌మిల్లులకు వెళ్లకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను అకాల వర్షం నిండా ముంచింది. సుమారు గంట పాటు పడిన వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


ఇది కూడా చదవండి: Telangana Activists Recognition | అమరవీరుల కుటుంబాలకు సముచిత గౌరవం.. జాబితా తయారీపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
