అక్షరటుడే, వెబ్‌డెస్క్: Engineering Students Death | కరెంట్ షాక్‌తో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా (Rangareddy District) మొయినాబాద్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
మొయినాబాద్ సమీపంలో కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ ఉంది. శుక్రవారం కళాశాలలో ఫెస్ట్ నిర్వహించారు. ఇంజినీరింగ్ కాలేజీలో ఫెస్ట్ అంటే పండుగలాంటి వాతావరణం ఉంటుంది. ఈ క్రమంలో దాదాపు 10 మంది విద్యార్థులు కాలేజీ విద్యార్థులు సాయంత్రం వేళ మద్యం తాగడానికి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లారు.
Engineering Students Death | పోలీసులు రావడంతో..
కేజీ రెడ్డి కాలేజీ గ్రామానికి దూరంగా పొలాల మధ్యలో ఉంటుంది. ఈ క్రమంలో విద్యార్థులు మద్యం తాగుతుండగా.. పోలీసులు పెట్రోలింగ్ వాహనంతో వచ్చారు. ఆందోళనకు గురైన విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. అయితే రాజిరెడ్డి అనే రైతు తన పొలంలోకి అడవి జంతువులు రాకుండా చుట్టూ కరెంట్ తీగలు పెట్టాడు. విద్యార్థులు ఆ వైర్‌ను గమనించకుండా పరుగులు తీయగా.. షాక్ కొట్టి ఇద్దరు చనిపోయారు. మృతి చెందిన విద్యార్థులను యశ్వంత్, మోక్షా చరణ్‌గా గుర్తించారు. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాలేజీలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad egg racket | గర్ల్స్ హాస్టల్ ముసుగులో ‘అండాల అక్రమ దందా’.. పోలీసుల దాడిలో షాకింగ్ నిజాలు బట్టబయలు!