Hyderabad egg racket | గర్ల్స్​ హాస్టల్ ముసుగులో ‘అండాల అక్రమ దందా’.. పోలీసుల దాడిలో షాకింగ్​ నిజాలు బట్టబయలు!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad egg racket | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్‌లో అత్యంత దారుణమైన అక్రమ దందా గుట్టు రట్టయింది. బేగంపేట్ పరిధిలో విద్యార్థినుల హాస్టల్ పేరిట ఒక అపార్ట్‌మెంట్‌లో సాగుతున్న ‘అండాల సేకరణ రాకెట్’ను పోలీసులు ఛేదించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పేద యువతులను టార్గెట్ చేస్తూ.. సంతాన సాఫల్య కేంద్రాలకు అండాలు, వీర్యకణాలను అక్రమంగా అమ్ముకుంటున్న ఘోరం ఈ దాడుల్లో బయటపడింది.

Hyderabad egg racket | అర్ధరాత్రి ఎస్‌ఓటీ మెరుపు దాడులు

పక్కా సమాచారంతో స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) బలగాలు, బేగంపేట పోలీసులు గురువారం అర్ధరాత్రి ప్రకాశ్ నగర్‌లోని నజ్రాన్ అపార్ట్‌మెంట్‌పై ఒక్కసారిగా దాడి చేశాయి. అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టిన పోలీసులు.. కింది అంతస్తులో తనిఖీలు చేపట్టారు. అక్కడ లభ్యమైన బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 10 మంది యువతులను అదుపులోకి తీసుకుని రక్షించారు.

Hyderabad egg racket | హాస్టల్ పేరుతో అసలు దందా!

ఏడాది కాలంగా ‘అమీ నీతా గర్ల్స్ హాస్టల్’ పేరుతో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఈ రాకెట్‌ను నడుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

  • హార్మోన్ ఇంజెక్షన్లు: ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన యువతులకు రకరకాల హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తూ వారి శరీరం నుంచి బలవంతంగా అండాలను సేకరిస్తున్నారు.
  • కార్పొరేట్ సెంటర్లకు విక్రయం: ఇలా సేకరించిన అండాలను, సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు చికిత్స అందించే ప్రముఖ ఫెర్టిలిటీ (Fertility) కేంద్రాలకు భారీ ధరలకు విక్రయిస్తున్నారు.
  • వీర్యకణాల సరఫరా: కేవలం అండాలే కాకుండా, అక్రమంగా పురుషుల వీర్యకణాలను కూడా సేకరించి సరఫరా చేస్తున్నారనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Hyderabad egg racket | వ్యభిచారం కోణంలోనూ దర్యాప్తు!

ఈ దందా వెనుక ఒక మహిళ కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పేదరికంలో ఉన్న ఇతర రాష్ట్రాల యువతులకు డబ్బు ఆశ చూపి హైదరాబాద్ రప్పించారా? లేదా వారిని నిర్బంధించి ఒత్తిడి తెచ్చారా? అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

కనీస వైద్య సదుపాయాలు లేని సాధారణ అపార్ట్‌మెంట్‌లో అండాల వెలికితీత వంటి సంక్లిష్ట ప్రక్రియలను ఎలా నిర్వహించారనే దానిపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, హాస్టల్ ముసుగులో ఈ యువతులతో వ్యభిచారం కూడా చేయిస్తున్నారా? అన్న సందేహాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Hyderabad egg racket | డాక్టర్ల పాత్రపై నిఘా!

సంఘటనా స్థలాన్ని డీసీపీ శ్రీధర్, బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ, సీఐ సైదులు సందర్శించి పరిశీలించారు. ఈ నెట్‌వర్క్ వెనుక నగరంలోని కొన్ని ప్రముఖ ఫెర్టిలిటీ హాస్పిటళ్లు, వైద్యుల ప్రమేయం ఉందా అన్న కోణంలో లోతైన దర్యాప్తు జరుపుతున్నట్లు డీసీపీ తెలిపారు.

ఈ దందాతో సంబంధమున్న హాస్పిటల్స్, ఏజెంట్లపై పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే అన్ని వివరాలను మీడియాకు వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *