అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Rain Alert | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) నగరంతో సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం కురిసింది. నేడు సైతం అక్కడక్కడ జల్లులు కురుస్తాయి.
వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, సిద్దిపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్, యాదాద్రి ప్రాంతాల్లో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం పంట కోతలు జరుగుతున్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Telangana Rain Alert | మరో అల్పపీడనం
బంగళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న నాలుగైదు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 2, 3 తేదీల్లో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
ఇది కూడా చదవండి..: Hyderabad egg racket | గర్ల్స్ హాస్టల్ ముసుగులో ‘అండాల అక్రమ దందా’.. పోలీసుల దాడిలో షాకింగ్ నిజాలు బట్టబయలు!