అక్షరటుడే, వెబ్డెస్క్ : Indiramma Towers | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసింది. వారికి సోమవారం మంజూరు పత్రాలు అందజేయనున్నారు.
తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB) సోమవారం నుంచి ‘ఇందిరమ్మ హౌసెస్ టవర్స్’ ప్రాజెక్టుకు సంబంధించిన కేటాయింపు లేఖలను పంపించనుంది. లబ్ధిదారులకు ఈ లేఖలు వారి నమోదిత మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా అందుతాయి. అలాగే ఇవి టీజీహెచ్బీ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపరాఉ.
Indiramma Towers | ప్రారంభించనున్న మంత్రి
శేరిలింగంపల్లిలోని రాయదుర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) మంజూరు పత్రాల పంపిణీని సోమవారం ప్రారంభించనున్నారు. మల్కం చెరువు వెనుక ఉన్న 2.85 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మించనున్నారు. దీనికి సైతం మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో ఒక్కొక్కటి సుమారు 528 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 480 ఫ్లాట్లు ఉంటాయి.
ఇది కూడా చదవండి : The Paradise ticket prices | ది ప్యారడైజ్ సినిమా.. తెలంగాణలో టికెట్ ధరల పెంపు