అక్షరటుడే, వెబ్‌డెస్క్ : The Paradise ticket prices | నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ది ప్యారడైజ్ మూవీ టికెట్ ధరల పెంపునకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
సినిమా స్పెషల్ షో, టికెట్ రేట్స్ హైక్‌కు అనుమతిస్తూ.. ప్రిన్సిపల్ సెక్రెటరి శిఖా గోయెల్ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 23న సాయంత్రం 6:30 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షో టికెట్ ధరను రూ.500 (జీఎస్టీతో కలిపి) ఖరారు చేసింది.
The Paradise ticket prices | 10 రోజుల పాటు..
ది ప్యారడైజ్ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు అంటే 27 వ తేది వరకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. మల్టీప్లెక్స్‌లకు రూ.94 (విత్ జీఎస్టీ), సింగిల్ స్క్రీన్‌లలో రూ.48 (విత్ జీఎస్టీ) అదనంగా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 3 వరకు మల్టీప్లెక్స్‌లకు రూ.45 (విత్ జీఎస్టీ), సింగిల్ స్క్రీన్‌లలో రూ.23 (విత్ జీఎస్టీ) టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ఓకే చెప్పింది. రేట్ల పెంపు నిర్ణయం నేపథ్యంలో నిర్మాతలు రూ.1 కోటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ఇవ్వాలని ఆదేశించింది.
The Paradise ticket prices | భారీ అంచనాలు
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ది ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఏషనాగుల సాంగ్‌కు లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సోనాల్ కులకర్ణి కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు.
#Theparadise Premiere ON
Telugana theatres price
Chennai Premiere confirmation tomorrow pic.twitter.com/weaBMPADQv
— Hari Kishore (@hari_kishoreD) September 20, 2026
దీనిని కూడా చదవండి : Kavitha Revanth Reddy | నేను బహుజనుల బాణాన్ని.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు