సినిమాFauji Movie | ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్​కు వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

Fauji Movie | ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్​కు వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

ప్రభాస్​ ఫౌజీ మూవీ షూటింగ్​ కోసం వెళ్తుండగా ఓ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fauji Movie | ప్రభాస్​ (Prabhas) ఫౌజీ మూవీ షూటింగ్​లో విషాదం చోటు చేసుకుంది. షూటింగ్​ కోసం వెళ్తుండగా ఓ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.

ప్రభాస్​ హీరోగా ‘ఫౌజీ’ (Fauj) సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మూవీ షూటింగ్ వెళ్తున్న యూనిట్ సభ్యులు కార్లలో బయలు దేరారు. హైదరాబాద్ (Hyderabad) నగర శివారులోని అబ్దుల్లాపూర్​మెట్​ వద్ద ప్రొడక్షన్​ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రొడక్షన్​ యూనిట్​కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Fauji Movie | డివైడర్​ను ఢీకొనడంతో..

ఫౌజీ సినిమాను హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మేకర్స్​ నిర్మిస్తున్నారు. ఈ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ వార్ డ్రామాగా దీనిని తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం షూటింగ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం చిత్ర యూనిట్ షూటింగ్​ కోసం వెళ్తుండగా కారు అదుపు తప్పి డివైడర్​ను ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి..: Academy Awards AI Rules | ఆస్కార్​ అవార్డుల్లో కీలక మార్పులు.. ఏఐ వినియోగంపై కొత్త నిబంధనలు!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hajj Subsidy Telangana| హజ్ యాత్రికులకు తెలంగాణ సర్కార్ ఊరట.. అదనపు భారం భరించనున్న ప్రభుత్వం!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Hajj Subsidy Telangana| పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో...

Nizamabad DRO Appointments | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాకు డీఆర్​వో, ఆర్డీవోల నియామకం

అక్షరటుడే, కామారెడ్డి: Nizamabad DRO Appointments |  రాష్ట్రంలో పలువురు అదనపు...

West Bengal Politics| బెంగాల్‌లో కమల వికాసం.. మే 9న నూతన ప్రభుత్వ అడుగులు!

అక్షరటుడు వెబ్‌డెస్క్:West Bengal Politics|పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం ఆరంభం...

BJP Victory Celebration | ఎల్లారెడ్డిలో బీజేపీ విజయోత్సవ సంబరాలు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: BJP Victory Celebration | వెస్ట్ బెంగాల్, అస్సాం,...