Jacqueline Sukesh letter | లవ్ యూ బుట్ట బొమ్మ జాక్వీ.. ప్రేమతో బేబీ బాయ్ సుఖేశ్!

Naresh Chandan
Jacqueline Sukesh letter

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jacqueline Sukesh letter | మనీలాండరింగ్ కేసులో కీలక పాత్రధారిగా నిలిచిన Jacqueline Fernandez కు జైలులో ఉన్న Sukesh Chandrasekhar ప్రేమతో లేఖ రాయడం నెట్టింట వైరల్​గా మారింది.

Jacqueline Sukesh letter | ప్రేమలేఖ

మనీలాండరింగ్ కేసులో సుఖేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన పేరుతో బయటకు వచ్చిన లేఖలో భావోద్వేగపూరిత ప్రేమ పదాలు ఉండటం విశేషం.

“బేబీ బుట్ట బొమ్మ, మై జాకీ.. All is fair in love and war. నువ్వు నా దానివి.. నేను ఎప్పటికీ నీవాడినే.. ఏది ఏమైనా ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటాను.. లవ్ యూ క్రేజీ.. ప్రేమతో నీ బేబీ బాయ్ సుఖేశ్..” అంటూ రాసి ఉన్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jacqueline Sukesh letter | అప్రూవర్‌గా మారేందుకు

ఇదిలా ఉండగా, మనీలాండరింగ్ కేసులో అప్రూవర్‌గా మారేందుకు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సిద్ధమవుతున్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సుఖేశ్ రాసినట్లు చెబుతున్న తాజా ప్రేమలేఖ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ వ్యవహారం పై ఇప్పటికే దర్యాప్తు సంస్థలు విచారణ కొనసాగిస్తున్నాయి. కాగా, తాజా పరిణామాలు ఈ కేసును మరోసారి వార్తల్లో నిలిపాయి. సోషల్ మీడియాలో ప్రేమలేఖపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని ప్రచార యత్నంగా భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Anantapur honey trap | హనీట్రాప్ కలకలం.. ఉచ్చులో రియల్టర్, జ్యోతిష్యుడు

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *