అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Udhayanidhi Stalin | తమిళనాడు ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్‌ను డీఎంకే పార్టీ ఎన్నుకోనున్నట్లు సమాచారం. నిన్న వెలుడిన ఫలితాల్లో డీఎంకే కూటమి ఓడిపోయిన విషయం తెలిసిందే. స్వయంగా సీఎం స్టాలిన్ (CM Stalin) తన నియోజకవర్గంలో ఓడిపోయారు.
స్టాలిన్ ఓటమితో ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకోనున్నట్లు సమాచారం. గెలిచిన ఎమ్మెల్యేలతో నేడు డీఎంకే అధినేత స్టాలిన్ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలు, తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. పార్టీ పరాజయానికి గల కారణాలతో పాటు, భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు స్టాలిన్ దిశానిర్దేశం చేయనున్నారు.
Udhayanidhi Stalin | 59 స్థానాల్లో విజయం
ఎన్నికల్లో డీఎంకే కూటమి 73 స్థానాల్లో గెలుపొందింది. సొంతంగా డీఎంకే (DMK) 59 చోట్ల విజయం సాధించింది. దీంతో ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. మరోవైపు అన్నాడీఎంకే 47, కాంగ్రెస్ 5, పీఎంకే 4, ముస్లిం లీగ్ 2, సీపీఐ 2, వీసీకే 2, సీపీఎం 2, బీజేపీ 1, డీఎండీకే ఒక స్థానంలో విజయం సాధించాయి. టీవీకే పార్టీ 108 చోట్ల గెలిచి మ్యాజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో ఆగిపోయింది. అయితే చిన్న పార్టీల సాయంతో విజయ్ సీఎం కానున్నారు. ఇప్పటికే టీవీకే మద్దతు తెలుపుతామని లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి. ఈ రోజు విజయ్ (Vijay) గవర్నర్‌ను కలవనున్నారు. దీంతో ఆయనతో ఎవరు వస్తారనేది కొద్ది సేపట్లో తేలనుంది.
ఇది కూడా చదవండి..: Rahul Gandhi Allegations| ఎన్నికల ఫలితాల్లో ‘బీజేపీ ప్లేబుక్’.. ఈసీ సహకారంతోనే అక్రమాలు: రాహుల్ గాంధీ

