Tamil Nadu Elections| తమిళనాడులో ముగిసిన ద్రవిడ శకం.. సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా!

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Tamil Nadu Elections| తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (TVK) 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని శాసిస్తున్న డీఎంకే ఈసారి కేవలం 74 సీట్లకు పరిమితమై రెండో స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో, ప్రజాస్వామ్య సంప్రదాయాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ భవన్‌కు పంపారు.

Tamil Nadu Elections| ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ఫైనల్..

ఈ ఎన్నికల్లో మరో షాకింగ్ పరిణామం ఏమిటంటే.. ముఖ్యమంత్రి స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి చేతిలో ఆయన పరాజయం చెందడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఓటమి అనంతరం స్టాలిన్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ఫైనల్ అని, దానిని తాను శిరసావహిస్తానని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా తనకు సేవ చేసే అవకాశం కల్పించిన తమిళ ప్రజలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Tamil Nadu Elections| కొత్త రాజకీయ అంచనాలు ..

మెజారిటీకి స్వల్ప దూరంలో నిలిచిన విజయ్ పార్టీ, ఇప్పుడు స్వతంత్రులు లేదా ఇతర చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే టీవీకే శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల తర్వాత డీఎంకే, ఏఐఏడీఎంకేయేతర పార్టీ అధికారంలోకి రాబోతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త రాజకీయ అంచనాలు మొదలయ్యాయి. రాబోయే కొద్ది రోజుల్లో కొత్త మంత్రివర్గంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Udhayanidhi Stalin | తమిళనాడు ప్రతిపక్ష నేతగా ఉదయనిధి!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *